TypeScript ని ఉపయోగించడం

TypeScript అనేది JavaScript కోడ్‌బేస్‌లకు టైప్ డెఫినిషన్‌లను జోడించడానికి ఒక ప్రసిద్ధ మార్గం. TypeScript JSX ని సపోర్ట్ చేస్తుంది మరియు మీరు మీ ప్రాజెక్ట్‌కి @types/react మరియు @types/react-dom ను చేర్చడం ద్వారా పూర్తి React Web సపోర్ట్ని పొందవచ్చు.

ఇన్‌స్టాలేషన్

అన్ని production-grade React frameworks TypeScript ఉపయోగాన్ని సపోర్ట్ చేస్తాయి. ఇన్‌స్టాలేషన్ కోసం ఫ్రేమ్‌వర్క్ ప్రత్యేక గైడ్‌ను అనుసరించండి:

ఉన్న React ప్రాజెక్ట్‌కు TypeScript ను చేర్చడం

React యొక్క type నిర్వచనాల తాజా వెర్షన్ ఇన్‌స్టాల్ చేయడానికి:

Terminal
npm install @types/react @types/react-dom

మీ tsconfig.json లో, క్రింది compiler ఆప్షన్స్ సెట్ చేయాలి:

1. lib లో dom ఉండాలి (గమనిక: ఎలాంటి lib ఆప్షన్ స్పెసిఫ్య్ చేయలేదు అంటే, dom డిఫాల్ట్ గా ఉంటుంది).
2. jsx ని తప్పనిసరిగా వెలిడ్ అయ్యే ఆప్షన్లలో ఒకదానికి సెట్ చేయాలి. చాలా అప్లికేషన్స్‌కి preserve సరిపోతుంది. మీరు లైబ్రరీని పబ్లిష్ చేస్తున్నట్లు అయితే, ఎలాంటి వేల్యూ ను ఎంచుకోవాలో తెలుసుకోవడానికి jsx డాక్యుమెంటేషన్ ను సంప్రదించండి.

TypeScript లో React కాంపోనెంట్లను ఎలా రాయడం

Note

JSX కలిగి ఉన్న ప్రతి ఫైల్ .tsx ఫైల్ విస్తరణను ఉపయోగించాలి. ఇది TypeScript-extension, ఈ ఫైల్ లో JSX ఉందని TypeScript కి తెలియజేస్తుంది.

React తో TypeScript వ్రాయడం, React తో JavaScript వ్రాయడముతో చాలా సమానం. ఒక కాంపోనెంట్‌తో పని చేస్తున్నప్పుడు ముఖ్యమైన తేడా మీరు మీ కాంపోనెంట్ యొక్క props కోసం types అందించవచ్చు. ఈ types సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయడానికి మరియు editor లో inline documentation అందించడానికి ఉపయోగించవచ్చు.

క్విక్ స్టార్ట్ గైడ్ నుండి MyButton కాంపోనెంట్ తీసుకుని, బటన్ కోసం title ను వివరిస్తున్న టైప్ ని జోడించవచ్చు:

function MyButton({ title }: { title: string }) {
return (
{title}

export default function MyApp() {
return (

Welcome to my app

<MyButton title="I'm a button" />

Note

ఈ sandboxes TypeScript code ను handle చేయగలవు, కానీ type-checker ను run చేయలేవు. అంటే, మీరు TypeScript sandboxes లో సవరణలు చేయవచ్చు, కానీ మీకు ఏదైనా type errors లేదా హెచ్చరికలు రావు. type-checking పొందడానికి, మీరు TypeScript Playground ను లేదా మరింత సర్వసన్నద్ధమైన online sandbox ను ఉపయోగించవచ్చు.

ఈ inline syntax ఒక కాంపోనెంట్‌కు types అందించడానికి అత్యంత సులభమైన మార్గం, కానీ మీరు కొన్ని ఫీల్డ్స్‌ను వివరిస్తూ ప్రారంభించినప్పుడు ఇది గందరగోళంగా మారవచ్చు. దీనికి బదులుగా, మీరు కాంపోనెంట్ యొక్క props ను వివరిచేందుకు interface లేదా type ఉపయోగించవచ్చు:

interface MyButtonProps {
/** The text to display inside the button */
title: string;
/** Whether the button can be interacted with */
disabled: boolean;

function MyButton({ title, disabled }: MyButtonProps) {
return (
{title}

export default function MyApp() {
return (

Welcome to my app

<MyButton title="I'm a disabled button" disabled={true}/>

మీ కాంపోనెంట్ యొక్క props ను వివరిస్తున్న type అవసరమున్నంత సులభంగా లేదా క్లిష్టంగా ఉండవచ్చు, కానీ అవి type లేదా interface తో వివరిస్తే ఒక object type గా ఉండాలి. TypeScript objects ను ఎలా వివరిస్తుందో మీరు Object Types లో నేర్చుకోవచ్చు కానీ మీరు Union Types ను కూడా props వివరిస్తూ ఉపయోగించడం గురించి ఆసక్తి చూపవచ్చు, ఇది కొన్ని విభిన్న type లలో ఒకటి కావచ్చు మరియు మరింత ఆధునిక ఉపయోగకేసులకు Creating Types from Types గైడ్ ఉపయోగపడుతుంది.

Hooks తో టైప్ ఉదాహరణలు

@types/react నుండి టైప్ డెఫినిషన్‌లు బిల్ట్-ఇన్ Hooks కోసం టైప్లను కలిగి ఉంటాయి, కాబట్టి మీరు వాటిని ఎలాంటి అదనపు సెటప్ లేకుండానే మీ కాంపోనెంట్లలో ఉపయోగించవచ్చు. అవి మీ కాంపోనెంట్ లో మీరు వ్రాసే కోడ్ ను పరిగణనలోకి తీసుకుంటాయి, కాబట్టి చాలా సార్లు మీరు ఇన్ఫెరెడ్ టైప్స్ పొందుతారు మరియు సాధారణంగా టైప్స్ ను ఇవ్వడానికి ఎటువంటి సమస్యలు ఎదుర్కొనవలసిన అవసరం లేదు.

అయితే, Hooks కోసం టైప్స్ ను ఎలా అందించాలో కొన్ని ఉదాహరణలను చూద్దాం.

useState

useState Hook ఇనీషియల్ state గా ఇవ్వబడిన వేల్యూ ను రీ-యూజ్ చేసుకొని ఆ వేల్యూ యొక్క టైప్ ఏమిటి అని నిర్ధారిస్తుంది. ఉదాహరణకు:

// టైప్ని "boolean" గా సూచిస్తుంది
const [enabled, setEnabled] = useState(false);

ఇది enabled కు boolean టైప్ ను అసైన్ చేస్తుంది, మరియు setEnabled boolean ఆర్గుమెంట్ ను స్వీకరించే ఫంక్షన్ లేదా boolean ను రిటర్న్ చేసే ఫంక్షన్ అవుతుంది. మీరు state కోసం టైప్ ను ఎక్సప్లిసిట్ గా ఇవ్వాలనుకుంటే, మీరు useState కాల్ కు టైప్ ఆర్గుమెంట్ ను ఇవ్వవచ్చు:

// టైప్ని "boolean" కి ఎక్సప్లిసిట్ గా సెట్ చేయండి
const [enabled, setEnabled] = useState<boolean>(false);

ఇది ఈ సందర్భంలో అంతగా ఉపయోగకరమైనది కాదు, కానీ మీరు type ను ఇవ్వాలనుకునే సాధారణ సందర్భం యూనియన్ టైప్ ఉన్నప్పుడు. ఉదాహరణకు, status ఇక్కడ కొన్ని వేర్వేరు స్ట్రింగ్స్ లో ఒకటి కావచ్చు:

type Status = "idle" | "loading" | "success" | "error";

const [status, setStatus] = useState<Status>("idle");

లేదా, ప్రిన్సిపుల్స్ ఫర్ స్తృక్చరింగ్ state లో సిఫారసు చేసినట్లు, మీరు సంబంధిత state ను ఒక ఆబ్జెక్ట్ గా గ్రూప్ చేసి, వేర్వేరు అవకాశాలను ఆబ్జెక్ట్ టైప్స్ ద్వారా వివరించవచ్చు:

type RequestState =
| { status: 'idle' }
| { status: 'loading' }
| { status: 'success', data: any }
| { status: 'error', error: Error };

const [requestState, setRequestState] = useState<RequestState>({ status: 'idle' });

useReducer

useReducer Hook ఒక కాంప్లెక్స్ Hook, ఇది ఒక reducer ఫంక్షన్ మరియు ఒక ఇనీషియల్ state ను తీసుకుంటుంది. reducer ఫంక్షన్ కోసం టైప్స్ అనేవి ఇనీషియల్ state నుండి అంచనా వేయబడతాయి. మీరు useReducer కాల్ కు టైప్ ఆర్గుమెంట్ ను ఇస్తూ state కోసం టైప్ ను ప్రొవైడ్ చేయవచ్చు, కానీ ఇనీషియల్ state పై టైప్ సెట్ చేయడం మంచిది:

import {useReducer} from 'react';

interface State {
count: number

type CounterAction =
| { type: "reset" }
| { type: "setCount"; value: State["count"] }

const initialState: State = { count: 0 };

function stateReducer(state: State, action: CounterAction): State {
switch (action.type) {
case "reset":
return initialState;
case "setCount":
return { ...state, count: action.value };
default:
throw new Error("Unknown action");

export default function App() {
const [state, dispatch] = useReducer(stateReducer, initialState);

const addFive = () => dispatch({ type: "setCount", value: state.count + 5 });
const reset = () => dispatch({ type: "reset" });

return (

Welcome to my counter

Count: {state.count}

Add 5
Reset

మేము TypeScript ను కొన్ని కీలక ప్రదేశాలలో ఉపయోగిస్తున్నాము:

• interface State reducer యొక్క state షేప్ ని డిస్క్రైబ్ చేస్తుంది.
• type CounterAction reducer కు dispatch చేసే వేర్వేరు actions ను డిస్క్రైబ్ చేస్తుంది.
• const initialState: State ఇనీషియల్ state కు టైప్ ను అందిస్తుంది, మరియు అదే టైప్ useReducer ద్వారా డిఫాల్ట్ గా ఉపయోగించబడుతుంది.
• stateReducer(state: State, action: CounterAction): State reducer ఫంక్షన్ యొక్క అర్గుమెంత్స్ మరియు రిటర్న్ వేల్యూ కు టైప్స్ ను సెట్ చేస్తుంది.

initialState పై టైప్ని సెట్ చేయడానికి మరింత ఎక్స్ప్లిసిట్ ఆల్టర్నేటివ్ useReducer కు టైప్ ఆర్గుమెంట్ ను అందించడం:

import { stateReducer, State } from './your-reducer-implementation';

const initialState = { count: 0 };

export default function App() {
const [state, dispatch] = useReducer<State>(stateReducer, initialState);

useContext

useContext Hook props ను కాంపోనెంట్స్ ద్వారా పంపకుండా, డేటా ను కాంపోనెంట్ ట్రీ లోకి పంపించడానికి ఒక పద్ధతి. ఇది ఒక provider కాంపోనెంట్ ను సృష్టించడం ద్వారా ఉపయోగించబడుతుంది మరియు తరచుగా ఒక Hook ను సృష్టించడం ద్వారా చైల్డ్ కాంపోనెంట్లో వేల్యూ ను వినియోగించడానికి ఉపయోగించబడుతుంది.

context ద్వారా ప్రొవైడ్ చేయబడిన వేల్యూ యొక్క టైప్, createContext కాల్ కు పంపబడిన వేల్యూ నుండి అంచనా వేయబడుతుంది:

import { createContext, useContext, useState } from 'react';

type Theme = "light" | "dark" | "system";
const ThemeContext = createContext<Theme>("system");

const useGetTheme = () => useContext(ThemeContext);

export default function MyApp() {
const [theme, setTheme] = useState<Theme>('light');

return (
<ThemeContext.Provider value={theme}>
<MyComponent />
</ThemeContext.Provider>

function MyComponent() {
const theme = useGetTheme();

return (

Current theme: {theme}

మీకు అర్థమయ్యే డిఫాల్ట్ వేల్యూ ఉన్నప్పుడు ఈ టెక్నిక్ పని చేస్తుంది - కానీ అప్పుడప్పుడు మీకు డిఫాల్ట్ వేల్యూ లేని సందర్భాలు ఉంటాయి, మరియు ఆ సందర్భాలలో null ఒక డిఫాల్ట్ వేల్యూ గా సరైనదిగా భావించవచ్చు. అయితే, టైప్-సిస్టం మీ కోడ్‌ ను అర్థం చేసుకునేలా చేయడానికి, మీరు createContext లో ContextShape | null ను ఎక్సప్లిసిట్ గా సెట్ చేయాలి.

ఇది | null ను context కన్స్యూమర్ల టైప్ లో నుండి తొలగించాల్సిన సమస్యను కలిగిస్తుంది. మా సిఫార్సు ఏమిటంటే, Hook ఒక రన్‌టైమ్ చెక్ చేసి, అది లేకపోతే ఒక ఎర్రర్ ని throw చేస్తుంది:

import { createContext, useContext, useState, useMemo } from 'react';

// This is a simpler example, but you can imagine a more complex object here
type ComplexObject = {
kind: string

// The context is created with `| null` in the type, to accurately reflect the default value.
const Context = createContext<ComplexObject | null>(null);

// The `| null` will be removed via the check in the Hook.
const useGetComplexObject = () => {
const object = useContext(Context);
if (!object) { throw new Error("useGetComplexObject must be used within a Provider") }
return object;

export default function MyApp() {
const object = useMemo(() => ({ kind: "complex" }), []);

return (
<Context.Provider value={object}>
<MyComponent />
</Context.Provider>

function MyComponent() {
const object = useGetComplexObject();

return (

Current object: {object.kind}

useMemo

useMemo Hook ఒక ఫంక్షన్ కాల్ నుండి ఒక మేమోరైజ్డ్ వేల్యూ ను సృష్టిస్తుంది/రీ-అక్సెస్ చేస్తుంది, 2వ పారామీటర్‌గా పంపబడిన డిపెండెన్సీలు మారినప్పుడు మాత్రమే ఫంక్షన్ రీ-రన్ అవుతుంది. Hook ను కాల్ చేయడం వలన వచ్చిన రిజల్ట్ అనేది మొదటి పారామీటర్‌ లోని ఫంక్షన్ నుండి రిటర్న్ అయిన వాల్యూ ద్వారా అంచనా వేయబడుతుంది. మీరు మరింత ఎక్స్ప్లిసిట్ గా టైప్ ఆర్గుమెంట్ ను Hook కు ప్రొవైడ్ చేయవచ్చు.

// The type of visibleTodos is inferred from the return value of filterTodos
const visibleTodos = useMemo(() => filterTodos(todos, tab), [todos, tab]);

useCallback

useCallback రెండవ పారామీటర్లోకి పంపబడిన డిపెండెన్సీలు ఒకేలా ఉన్నంత వరకు ఒక ఫంక్షన్‌కు స్టేబుల్ రిఫరెన్స్ ను అందిస్తాయి. useMemo లాగా, ఫంక్షన్ యొక్క టైప్ మొదటి పారామీటర్లోని ఫంక్షన్ యొక్క రిటర్న్ వేల్యూ నుండి అంచనా వేయబడుతుంది, మరియు మీరు మరింత ఎక్స్ప్లిసిట్ గా టైప్ ఆర్గుమెంట్ ను Hook కు ప్రొవైడ్ చేయవచ్చు.

const handleClick = useCallback(() => {

}, [todos]);

TypeScript strict mode లో పని చేస్తున్నప్పుడు useCallback లో మీ కాల్ బ్యాక్ లోని పారామీటర్స్ కు టైప్స్ ను చేర్చాలి. ఇది ఎందుకంటే కాల్ బ్యాక్ యొక్క టైప్ అనేది ఫంక్షన్ యొక్క రిటర్న్ వేల్యూ నుండి అంచనా వేయబడుతుంది, మరియు పారామీటర్స్ లేకుండా టైప్ అనేది పూర్తిగా అర్థం కాదు.

మీ కోడ్-స్టైల్ ప్రిఫరెన్సెస్ పై ఆధారపడి, కాల్ బ్యాక్ ను డిఫైన్ చేసే సమయంలో ఈవెంట్ హ్యాండ్లర్ కోసం టైప్ ను అందించడానికి React టైప్స్ నుండి *EventHandler ఫంక్షన్స్ ను ఉపయోగించవచ్చు:

import { useState, useCallback } from 'react';

export default function Form() {
const [value, setValue] = useState("Change me");

const handleChange = useCallback<React.ChangeEventHandler<HTMLInputElement>>((event) => {
setValue(event.currentTarget.value);
}, [setValue])

return (

Value: {value}

ఉపయోగకరమైన టైప్స్

@types/react ప్యాకేజ్ నుండి చాలా విస్తృతమైన టైప్స్ సెట్ వస్తుంది, React మరియు TypeScript ఎలా ఇంటరాక్ట్ అవుతాయి అనే దాని గురించి మీరు సౌకర్యంగా భావించినప్పుడు ఇది చదవడం విలువైనది. మీరు వాటిని DefinitelyTyped లో React యొక్క ఫోల్డర్ లో కనుగొనవచ్చు. ఇక్కడ మేము కొన్ని సాధారణంగా ఉపయోగించే టైప్స్ ను కవర్ చేస్తాము.

DOM ఈవెంట్స్

React లో DOM ఈవెంట్స్ తో పని చేస్తున్నప్పుడు, ఈవెంట్ యొక్క టైప్ అనేది ఈవెంట్ హ్యాండ్లర్ నుండి తరచుగా అంచనా వేయబడుతుంది. అయితే, ఒక ఫంక్షన్ ను ఈవెంట్ హ్యాండ్లర్ కు పంపించడానికి ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే, మీరు ఈవెంట్ యొక్క టైప్ ను ఎక్సప్లిసిట్ గా సెట్ చేయాలి.

import { useState } from 'react';

export default function Form() {
const [value, setValue] = useState("Change me");

function handleChange(event: React.ChangeEvent<HTMLInputElement>) {
setValue(event.currentTarget.value);

return (

Value: {value}

React టైప్స్ లో చాలా రకాల ఈవెంట్స్ అందుబాటులో ఉన్నాయి - పూర్తి లిస్ట్ ను ఇక్కడ చూడవచ్చు, ఇవి DOM నుండి పాపులర్ ఈవెంట్స్ పై ఆధారపడి ఉంటాయి.

మీరు వెతుకుతున్న టైప్ ను నిర్ణయించేటప్పుడు మీరు ముందుగా మీరు ఉపయోగిస్తున్న ఈవెంట్ హ్యాండ్లర్ కోసం హోవర్ ఇన్ఫర్మేషన్ ని చూడవచ్చు, ఇది ఈవెంట్ టైప్ ని చూపిస్తుంది.

ఈ లిస్టులో లేని ఈవెంట్ ను ఉపయోగించాల్సి వస్తే, మీరు React.SyntheticEvent టైప్ ను ఉపయోగించవచ్చు, ఇది అన్ని ఈవెంట్స్ కోసం బేస్ టైప్.

చైల్డ్ ఎలిమెంట్

ఒక కాంపోనెంట్ యొక్క చైల్డ్ ఎలిమెంట్ ను వివరించడానికి రెండు సాధారణ మార్గాలు ఉన్నాయి. మొదటిది React.ReactNode టైప్ ను ఉపయోగించడం, ఇది JSX లో చైల్డ్ ఎలిమెంట్ గా పంపబడగల అన్ని పోసిబుల్ టైప్ల యొక్క యూనియన్:

interface ModalRendererProps {
title: string;
children: React.ReactNode;

ఇది చైల్డ్ ఎలిమెంట్ యొక్క బ్రాడ్ డెఫినిషన్. రెండవది React.ReactElement టైప్ ను ఉపయోగించడం, ఇది కేవలం JSX ఎలెమెంట్స్ మాత్రమే, JavaScript primitives వంటి strings లేదా numbers కాదు:

interface ModalRendererProps {
title: string;
children: React.ReactElement;

గమనించండి, మీరు TypeScript ను చైల్డ్ ఎలిమెంట్ ఒక నిర్దిష్ట టైప్ JSX ఎలిమెంట్స్ ని వివరించడానికి ఉపయోగించలేరు, కాబట్టి కేవలం
చైల్డ్ ఎలిమెంట్ మాత్రమే అంగీకరించే ఒక కంపోనెంట్ ను టైప్-సిస్టమ్‌ ద్వారా వివరించలేరు.

React.ReactNode మరియు React.ReactElement రెండింటి ఉదాహరణను టైప్-చెక్కర్ తో సహా ఈ TypeScript ప్లేగ్రౌండ్ లో చూడవచ్చు.

స్టైల్ props

React లో ఇన్లైన్ స్టైల్స్ ఉపయోగిస్తున్నప్పుడు, style prop కు పంపబడే ఆబ్జెక్ట్ ను డిస్క్రైబ్ చేయడానికి మీరు React.CSSProperties ను ఉపయోగించవచ్చు. ఈ టైప్ అన్ని పాసిబుల్ CSS ప్రాపర్టీస్ యొక్క యూనియన్, మరియు ఇది మీరు style prop కు సరైన CSS ప్రాపర్టీస్ పంపిస్తున్నారని నిర్ధారించడానికి మరియు మీ ఎడిటర్ లో ఆటో-కంప్లీట్ పొందడానికి మంచి మార్గం.

interface MyComponentProps {
style: React.CSSProperties;

మరింత నేర్చుకోవడానికి

ఈ గైడ్ React తో TypeScript ఉపయోగించడం గురించి బేసిక్స్ ను కవర్ చేసింది, కానీ ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంది. డాక్స్ లోని ఇండివిడ్యుఅల్ API పేజీలలో TypeScript తో వాటిని ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి మరింత ఇన్-డెప్త్ డాక్యుమెంటేషన్ కలిగి ఉండవచ్చు.

మేము ఈ కింది రిసోర్సెస్ ను సిఫార్సు చేస్తున్నాము:

• TypeScript హ్యాండ్‌బుక్ TypeScript కోసం ఆఫిసిఅల్ డాక్యుమెంటేషన్, మరియు అధిక భాగం కీలక లాంగ్వేజ్ ఫీచర్లను కవర్ చేస్తుంది.

• TypeScript రిలీజ్ నోట్స్ కొత్త ఫీచర్లను ఇన్-డెప్త్ గా కవర్ చేస్తాయి.

• React TypeScript చీట్ షీట్ TypeScript తో React ఉపయోగించడానికి కమ్యూనిటీ-మైన్టైన్డ్ చీట్ షీట్, చాలా ఉపయోగకరమైన ఎడ్జ్ కేసులను కవర్ చేస్తూ ఈ డాక్యుమెంట్ కంటే మరింత విస్తృత తనాన్ని అందిస్తుంది.

• TypeScript కమ్యూనిటీ Discord TypeScript మరియు React సమస్యలతో సహాయం కోసం ప్రశ్నలు అడగడానికి మరియు సహాయం పొందడానికి గొప్ప ప్రదేశం.